 
															రేడియాలజిస్ట్‌ల జాడేది?
● ఐదు సింగరేణి ఆస్పత్రుల్లో ఖాళీలు ● నిరుపయోగంగా స్కానింగ్ యంత్రాలు
గోదావరిఖని: సింగరేణిలోని ఏడు ఆస్పత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. కానీ, అర్హతగల రేడియాలజిస్ట్‌లను నియంచలేదు. ఫలితంగా రూ.60లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 5 స్కానింగ్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి.
స్కానింగ్ యంత్రాలతో మేలు..
స్కానింగ్ యంత్రం ద్వారా గుండెకు సంబంధిత వ్యాధులను సకాలంలో గుర్తించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిద్వారా 2డీ ఇకో, గర్భానికి సంబంధించి ఆల్ట్రాసౌండ్స్ స్కానింగ్, లివర్, కిడ్నీలో రాళ్ల గుర్తింపు స్కానింగ్‌తోనే సాధ్యమంటున్నారు. సింగరేణి యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేసినా.. రేడియాలజిస్ట్‌లు అందుబాటులో లేక పరీక్షలు నిలిచిపోతున్నాయి. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
సకాలంలో స్పందించని వైద్యులు..
కార్పొరేట్‌కు ధీటుగా సింగరేణి కార్మికులకు వైద్యం అందిస్తామని సంస్థ సీఎండీ బలరాం చెబుతు న్నారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్తే డాక్టర్లు సరిగా స్పందించడం లేదనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా, బా ధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు.
రెండ్రోరోజుల క్రితం సింగరేణి కార్మికుడి కుమార్తెను పురిటి నొప్పులతో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఇంజక్షన్ వేయగా నొప్పి తగ్గింది. ఆ తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. మరుసటిరోజు డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు స్కానింగ్ అవసరమని ఓ ప్రైవేట్ సెంటర్‌కు పంపించారు. గర్భంలోనే శిశువు మృతి చెందిందని స్కానింగ్ రిపోర్టులో నిర్ధారించారు. సింగరేణి ఆస్పత్రిలోనే స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని నిపుణులు అంటున్నారు.
 
							రేడియాలజిస్ట్‌ల జాడేది?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
