 
															ఇక రహదారులపైనే తనిఖీలు
● రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ● జిల్లాకు ముగ్గురు అధికారుల కేటాయింపు ● కొత్తవారితో కలిపితే ఎనిమిదికి చేరిన ఇన్‌స్పెక్టర్ల సంఖ్య ● రవాణా శాఖ చెక్‌పోస్టుల ఎత్తివేత పర్యవసానం ● వాహనాల అక్రమ ప్రవేశాలకు అడ్డుకట్ట వేసే యోచన 
పెద్దపల్లిరూరల్: అంతర్ జి ల్లాల సరిహద్దులను అక్రమంగా దాటే వాహనాలను నియంత్రించేందుకు ఏర్పా టు చేసిన ఆర్‌టీఏ(రవాణా శాఖ) చెక్‌పోస్టులను ప్రభు త్వం గతంలోనే ఎత్తివేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో రోడ్లపైనే వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 111మంది అధికారులను నియమించి శిక్షణ కూడా ఇప్పించింది. ఈక్రమంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో కొత్తగా ముగ్గురు అధికారులు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. వారిరాకతో జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌స్థాయి అధికారుల సంఖ్య 8కి చేరింది.
మూడునెలల క్రితమే ఎత్తివేత
రాష్ట్రప్రభుత్వం మూడు నెలల క్రితమే రవాణా శాఖ ఆధ్వర్యంలోని అంతర్ జి ల్లాల సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేసింది. అయినా ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఆన్‌లైన్‌లో పర్మిట్లు పొందే విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు ఆన్‌లైన్ పర్మిట్లతో రవాణా చేస్తున్నట్లు గుర్తించి చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
రోడ్డుపైనే తనిఖీలు ముమ్మరం
అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను ఎత్తేయడంతో రోడ్లపై సరుకుల లోడ్‌తో వెళ్తున్న వాహన తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సరిపడా అధికారులు ఉన్నా.. కిందిస్థాయి సిబ్బంది కొరత ఉంది. చెక్‌పోస్టులను ఎత్తివే స్తూ ఆదేశాలిచ్చినా ప్రభుత్వం.. కొత్తగా అనుసరించాల్సిన విధివిధానాలపై ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. కార్యాలయాల్లో సిబ్బంది అవసరమైనంత లేక అవస్థలు పడుతున్నారు. చెక్‌పోస్టుల ఎత్తివేతతో రోడ్లపై తిరిగే వాహనాలను జిల్లాల పరిధిలోని ఎంవీఐ, ఏఎంవీఐ, ఆర్టీవో స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి వస్తే.. ఆ సమయంలోనూ కిందిస్థాయి సిబ్బంది అవసరమే. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు కొద్దినెలల క్రితం ఏకకాలంలో ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
