నేడు ముగియనున్న గడువు | - | Sakshi
Sakshi News home page

నేడు ముగియనున్న గడువు

Oct 23 2025 6:31 AM | Updated on Oct 23 2025 6:31 AM

నేడు

నేడు ముగియనున్న గడువు

పెద్దపల్లి: జిల్లాలోని వైన్స్‌షాప్‌ల కోసం గురు వారం సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల దాఖలుకు గడువు ముగుస్తుందని ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈనెల 27న ఉదయం 11గంటలకు బందపల్లి స్వరూప గార్డెన్స్‌లో లాటరీ పద్ధతిన మద్యం షాప్‌లు కేటాయిస్తామని తెలిపారు.

లింగ నిర్ధారణ నేరం

పెద్దపల్లిరూరల్‌: స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహ కులు నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణుల స్కానింగ్‌ వివరాలను ఫారం – ఎఫ్‌ లో పొందుపర్చాలని సభ్యుడు రాజగోపాల్‌ కో రారు. గ్రామైక్యసంఘం సభ్యులకు లింగ వివక్షతపై అవగాహన కల్పిస్తామని అధ్యక్షురాలు స్నేహ అన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాకేశ్‌తోపాటు వెంకటేశ్వర్లు, జగన్‌ పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్లలో ఓపెన్‌హౌస్‌

పెద్దపల్లిరూరల్‌: నేరాల నియంత్రణకు పోలీసులు నిర్వర్తించే విధులు, ఆయుధాల వినియో గం, లాకప్‌గదుల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూరల్‌, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఓపెన్‌హౌస్‌ నిర్వహించారు. ఎస్సైలు మల్లేశ్‌, నరేశ్‌, ఏఎస్సై రామస్వామి, సిబ్బంది తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల వారోత్సవావల సందర్భంగా పెద్దకల్వల నోబెల్‌స్కూల్‌ విద్యార్థుల సందేహాలను తీర్చారు.

నేడు ముగియనున్న గడువు 1
1/1

నేడు ముగియనున్న గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement