అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Oct 23 2025 6:31 AM | Updated on Oct 23 2025 6:31 AM

అర్హు

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

పెద్దపల్లిరూరల్‌: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయ న ఇందిరమ్మ కమిటీ సభ్యు లు, అధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డుల వారీగా పర్యటించి అర్హులనే ఎంపిక చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడ్డట్టు తన దృష్టికి వచ్చినా, అనర్హులను ఎంపిక చేసినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ స్వరూప పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలి

గోదావరిఖని: నేరాల ని యంత్రణలో యువత భాగస్వాములు కావాల ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. పోలీ స్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తుచేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, ఎస్సైలు రమేశ్‌, సంధ్యారాణి, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎల్లప్ప, జోన్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌, రిజయా న్‌ చైర్మన్‌ రాజేందర్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి1
1/1

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement