
రైతుల సంక్షేమమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ– డీ86 క్యాంప్ ఆఫీస్ చుట్టూ రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. త్వరలోనే సుల్తానాబాద్ ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీసులకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డీఈఈ మధుమతి పాల్గొన్నారు.