
దుబాయ్ వ్యాపారులతో సమీక్ష
రామగుండం: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య స మావేశాలకు హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా మంగళవారం దుబాయ్ వ్యా పార దిగ్గజాలతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమావేశమయ్యారు. గనులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యా, వైద్య సెక్టార్లకు సంబంధించిన వ్యాపారులతో సమీక్షించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో సమృద్ధిగా బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్డు సదుపాయాలు ఉన్న స్థలాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ వంతు ప్రోత్సహకాన్ని అందజేస్తామని, పరిశ్రమల స్థాపనతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.
నోటీసు బోర్డుపై ధరల పట్టిక ఉండాలి
సుల్తానాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల పట్టిక రోగులకు తెలిసే విధంగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూ చించారు. సుల్తానాబాద్‌లోని పలు ఆస్పత్రుల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ధర ల పట్టిక ప్రకారం మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ప్రోగ్రాంఽ ఆధికారులు బి.శ్రీరాములు, కేవీ.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
లైవ్ సర్టిఫికెట్ సమర్పించాలి
గోదావరిఖని: సీఎంపీఎఫ్ పెన్షన్‌దారులు లైవ్ సర్టిఫికెట్ నిర్ణీత ఽగడువులోగా సమర్పించాలని గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ కమిషనర్లు హరిపచౌరీ, కె.గోవర్దన్ సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా లైవ్ సర్టిఫికెట్ అందజేస్తే తమ పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉండదన్నారు. దీనికోసం కార్యాలయం పరిధిలోని అన్ని ఏరియాల్లో ప్రత్యేక తేదీలు నిర్ణయించినట్లు తెలిపారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌కాపీ(పీపీవో), ఆధార్‌కార్డు, బ్యాంక్‌పాస్‌బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌నంబర్ తీసుకుని క్యాంపుకు హాజరుకావాలన్నారు. లేకుంటే మీసేవా సెంటర్‌లో వచ్చేనెల 3,4తేదీల్లో ఆర్జీ–1, 6,7తేదీల్లో ఆర్జీ–2 ఏరియా, 10,11 తేదీల్లో ఆర్జీ–3 ఏరియా, నవంబర్ 3,28వరకు రీజినల్ సీఎంపీఎఫ్ కార్యాలయంలో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేని పక్షంలో జనవరి నుంచి తమ పెన్షన్ నిలిచిపోతుందన్నారు.
అట్టహాసంగా చదరంగం పోటీలు
పెద్దపల్లి: పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్‌లో 69వ ఉమ్మడి జిల్లా అండర్– 14 ఎస్జీఎఫ్ చదరంగం పోటీలను జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు. చదరంగంతో మేధస్సు, ప్రశాంతత పెరుగుతుందన్నారు. గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులు వచ్చేనెల పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడిజిల్లాలోని 40మంది విద్యార్థులు హాజరయ్యారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్, జిల్లా పెటా అధ్యక్షుడు వేల్పుల సురేందర్, అర్బీటర్ కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటినుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ కళాశాల క్రీడా మైదానంలో 22వ తేదీన 17 ఏల్ల బాలబాలికలకు, 23వ తేదీన 14 సంవత్సరాల బాలురకు క్రికెట్ ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. అర్హురు ఉదయం 9గంటలకు ఎంట్రీ ఫారంతో రిపోర్ట్ చేయాలని, వివరాలకు పీడీ కే.శ్రీనివాస్ 9440394743 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

దుబాయ్ వ్యాపారులతో సమీక్ష

దుబాయ్ వ్యాపారులతో సమీక్ష

దుబాయ్ వ్యాపారులతో సమీక్ష