
అమరులకు సెల్యూట్
గోదావరిఖని: పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరమని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి మంగళవారం పోలీస్‌కమిషనరేట్ కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళి అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలకు చేసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. ప్రజల్లో మంచి పేరు తీసుకరావడానికి చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పోలీసులు పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

అమరులకు సెల్యూట్