 
															పనులు త్వరగా పూర్తిచేయాలి
రామగుండం/గోదావరిఖనిటౌన్: రామగుండం బైపాస్ రోడ్డు నుంచి పోస్టాఫీస్ వరకు కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు, శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం ప్రధాన రహదారిలోని డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం ఎత్తును పరిశీలించి ఇంజినీర్లతో చర్చించి ఎత్తు తగ్గించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న జెన్‌కో క్వార్టర్లను పరిశీలించారు. జెన్‌కో అధికారులతో చర్చించి రోడ్డు విస్తరణకు పలు క్వార్టర్లను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ స్థల పరిశీలన చేశారు. కళాశాల నిర్మాణం స్థానిక యువత, విద్యార్థులకు విద్యా సౌకర్యాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
మెగాథర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించండి
గోదావరిఖని: రామగుండంలో 800మెగావాట్ల పవర్ ప్లాంట్ త్వరలో ప్రారంభించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడానికి లిఫ్ట్ మంజూరు చేయాలన్నారు. సూపర్‌క్లిటికల్ థర్మల్‌ఫ్లాంట్ నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, గత నెలలో బోర్డు ఆమోదించిందని డిప్యూటీ సీఎం తెలిపినట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
