 
															ఎన్టీపీసీ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు అధికారి సస్పెన్షన్ ఎత్తి వేయాలని అధికారుల సంఘం ప్రతినిధులు నల్లబ్యాడ్జీలతో సోమవారం నిరసన చేపట్టారు. ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలోని సోలార్ ప్లాంట్‌లో ఈనెల 9న ఓ కాంట్రాక్టు కార్మికుడిపై ట్రాన్స్‌ఫార్మర్ మీద పడి మృతి చెందాడు. ఈ సంఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే స్పందిస్తూ సంబంధిత ఇంజినీరింగ్ ఇన్‌చార్జ్ డీజీఎం రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేసింది. రామగుండం ఎన్టీపీసీ అధికారుల సంఘం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాజెక్టులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించకుంటే ఈనెల 27వ తేదీన గేట్ మీటింగ్ నిర్వహిస్తామని అధికారుల సంఘం అధ్యక్షుడు మహేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నితీశ్ కుమార్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
