 
															అభివృద్ధి పనులకు నిధులు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 
రామగిరి(మంథని): అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభ యం ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో మంత్రి ఆదివా రం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బుధవారంపేట(రామయ్యపల్లి) గ్రామానికి చెందిన సోమి శెట్టి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించా రు. మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క మంత్రిని కలిసి పలు సమస్యలు విన్నవించారు. ప్రధానంగా బుధవారంపేట గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీహాల్ మరమ్మతు, విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకులంగా స్పందించారు. కాగా, రామయ్యపల్లి స్టేజీ వద్ద మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంత్రి లక్ష్మణ్‌ను కలిశారు. ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్నతో కలిసి మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, నాయకులు రోడ్డ బాపన్న, బుద్దార్థి బుచ్చయ్య, దేవునూరి రజిత, ఆరెల్లి కొము రయ్య, దేవునూరి శ్రీనివాస్, తీగల సమ్మయ్య, నరేశ్, బావు కత్తెరసాల, కన్నూరి శ్రావణ్, పూదరి రమేశ్, మల్లయ్య, రాజయ్య, మహేందర్, ముస్కుల సురేందర్‌రెడ్డి, రావికంటి సతీశ్ కుమార్, అజీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
