 
															రాజకీయాలను శాసించాలి
● యాదవ సంఘాల ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాని కొమురయ్య 
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: స్థానిక ఎన్నికల్లో యాదవులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకుని రాజకీ యాలను శాసించాలని యాదవ సంఘాల ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాని కొమురయ్య అన్నారు. స్థాని క ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం ఆధ్వర్యంలో ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. జనాభాలో 22 శాతం యాదవులు ఉన్నారని, ఆ ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు లభించడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అంశాలపై ఈనెల 24న కరీంనగర్ జిల్లాలోని చెంజర్ల ఫామ్‌హౌస్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, పోటీచేసేవారు హాజ రు కావాలని ఆయన కోరారు. ప్రతీ ఆదివారం యా దవులు మద్యం, మాసం మానేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు సందనవేన రా జేందర్, మారం తిరుపతియాదవ్, రాజయ్యయా దవ్, తమ్మడబోయిన ఓదెలు, కుమార్ యాదవ్, నాగారపు సత్యనారాయణ, చిలారపు పర్వతాలు, మేకల రాజేందర్, అట్ల సాగర్, రాజం మహంత కృష్ణ, పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, బత్తిని లక్ష్మణ్, రాజ్‌కుమార్ ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
