నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు | - | Sakshi
Sakshi News home page

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు

Oct 19 2025 6:11 AM | Updated on Oct 19 2025 6:11 AM

నవ్వి

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు

దీపావళి వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు సిద్ధమైన సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం ఫుడ్‌ కోర్డులు, ఆకట్టుకునే ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, అధికారులు

గోదావరిఖని: దీపావళి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, ఏసీపీ రమేశ్‌తో కలిసి శనివారం జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం నిర్వహించే ఉత్సవాలు కనీవినీ ఎరుగనతి రీతిలో ఉండాలని వారు అధికారులను ఆదేశించారు. ఈమేరకు జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం ముస్తాబవుతోంది.

ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయింపు..

వేడుకల కోసం సింగరేణి యాజమాన్యం దాదాపు రూ.20లక్షలు, ఇతర సంస్థలు మరో రూ.10లక్షల వరకు వెచ్చిస్తున్నాయి. వేడుకల కోసం గ్రౌండ్‌లో ప్రత్యేక స్టేజీ నిర్మిస్తున్నారు. మిరుమిట్లుగొలిపేలా.. సినీ ప్రపంచాన్ని తలపించేలా భారీ సెట్టింగ్‌లు వేస్తున్నారు. జిగేల్‌మనిపించే రంగురంగలు విద్యు త్‌ దీపాలు అమర్చుతున్నారు.

కళాకారుల రాక

దీపావళి వేడుకల సందర్భంగా ఆహూతులను అలరించేందుకు సినీ, మిమిక్రీస్టార్‌ శివారెడ్డి నేతృత్వంలో సినీనటులు, కళాకారులు తరలివస్తారు. ఇందు లో సినీ హాస్యనటుడు ఆలీ, గాయని గీతామాధురి, జబర్‌దస్త్‌ బుల్లెట్‌టీం భాస్కర్‌, గోవిందడాన్స్‌ గ్రూ ప్‌ కళాకారులు ఉంటారు. వీరు పాటలు, నృత్యా లతో అదరగొడతారు. మద్రాస్‌ నుంచి ఫైర్‌డాన్స్‌ బృందం కూడా రానుంది. చివరగా నరకాసుర వధ నిర్వహించనున్నారు.

ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు..

అతిథుల కోసం తెలంగాణ రుచులు అందించేలా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ స్టాళ్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఆకాశాన్ని తాకేలా తారాజువ్వలు, పటాకుల ప్రదర్శన, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలు, తెలంగాణ రుచుల సమ్మేళనాలు, ఫుడ్‌ స్టాల్స్‌, ఆకర్షణీయమైన ఎగ్జిబిషన్లు స్టాల్స్‌, స్పెషల్‌ క్యాంప్‌ ఫైర్‌ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు1
1/2

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు2
2/2

నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement