 
															బీసీ డిక్లరేషన్ సంగతేమిటి?
పెద్దపల్లిరూరల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తావద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేశారు. నాయకులు మాట్లాడుతూ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్ల అమలులో ఇంకా మభ్యపెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సంపత్, పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, రాజగోపాల్, సంపత్‌రావు, సంతోష్, ఈర్ల శంకర్, ఉమేశ్, కృష్ణ, కిషన్, రమేశ్, కృష్ణ, సతీశ్, శివయ్య, పూరెల్ల రాజేశం, శ్రీధర్, వీరేశ్, రాజేంద్రప్రసాద్, కృష్ణమోహన్, అంజి, రాజు, కుమార్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యా ల ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
