 
															ఆర్‌ఎస్‌యూలో చేరి అజ్ఞాతంలోకి
పీపుల్స్‌వార్ ఉద్యమంలో మల్లోఝుల కోటేశ్వర్‌రావుతో కలిసి మేం పనిచేసిన కాలంలో వేణుగోపాల్ ఆర్‌ఎస్‌యూలో చురుకుగా పనిచేశాడు. ప్రభుత్వ ఐటీఐలో రేడియో, టీవీ మెకానిజం కోర్సు చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌ను బలోపేతం చేశాడు. మేం ఉండే ప్రాంతాలకు సాహిత్యాన్ని తీసుకొస్తూ అజ్ఞాతం వైపు అడుగులేశాడు. 44 ఏళ్లతర్వాత జనంలోకి వచ్చిన వేణు పెద్దపల్లికి వస్తారని మిత్రులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు.
– ఠాకూర్ జగన్‌సింగ్, మాజీ మావోయిస్టు, పెద్దపల్లి
వస్తాడనే అనుకుంటున్న
వేణు మాకు సమీప బంధువు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి ఉండేవాళ్లం. అడవిబాట పట్టి 44 ఏళ్లక్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత వేణు ఏనాడూ ఇంటివైపు చూడలేదు. బుధవారం మహారాష్ట్ర సీఎం ఎదుట సరెండర్ అయినట్టు టీవీల్లో చూసినం. వీలైనంత తొందరలో పెద్దపల్లికి వచ్చి బంధువులు, స్నేహితులను కలుస్తడనే అనుకుంటున్న.
– రాపెల్లి అంజన్న, పెద్దపల్లి
జనంలోకి రావడం మంచిదే
44 ఏళ్ల పాటు సాయుధ పోరాటం చేసిన మల్లోజుల వేణు జనజీవన స్రవంతిలోకి రావడం మంచిదే. మారిన పరిస్థితులను బట్టి వేణు తీసుకున్న నిర్ణయం సరైనదే. ఐటీఐ చదువుతూ అడవిబాట పట్టిన వేణును చూడాలనే ఆత్రుత ఈప్రాంతవాసుల్లో చాలాబాగా ఉంది. అందుకే పెద్దపల్లికి ఓసారి రావాలనే కోరుకుంటున్న.
– రాంనారాయణ, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి
 
							ఆర్‌ఎస్‌యూలో చేరి అజ్ఞాతంలోకి
 
							ఆర్‌ఎస్‌యూలో చేరి అజ్ఞాతంలోకి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
