 
															పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు
● రామగుండం పోలీస్ కమిషనర్  అంబర్ కిశోర్ ఝా 
గోదావరిఖని: పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. సెప్టెంబర్ నెల నేరసమీక్ష సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమై సూచనలు చేశారు. సమన్వయం, ప్రణాళికతొ నేరా ల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. సాంకేతికత, శాసీ్త్రయ పద్ధతిన కేసులు దర్యాప్తు చేయాలని అన్నారు. ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాల్లో దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో బాధితులకు త్వరగా ప రిహారం అందేలా చూడాలని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలని కమిషనర్ పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, ట్రాఫిక్, సీసీపీఎస్, సీసీఎస్, ఏఆర్ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, శ్రీనివాస్, రంగారెడ్డి, నాగేంద్రగౌడ్, ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
