 
															దిగుబడిపై ప్రభావం
ఏడెకరాల్లో పత్తి వేసిన. ఏపు గా పెరిగింది. మంచి దిగుబ డి వస్తుందని ఆశపడ్డా. మొ న్నటివరకు కురిసిన వానల తో ఆకు ఎర్రబడింది. కాయ లు నల్లగా మారినయి. దిగుబడిపై దిగులు ఉంది. తేమ నిబంధన తొలగిస్తేనే నయం. – కలవేన కుమార్, కొత్తపల్లి
మార్కెట్‌లో పత్తి అమ్ముకునేందుకు ఈనెలాఖరులొగా ఏదో యాప్‌లో వివరాలు న మోదు చేయాలట. దానిగు రించి తెల్వది. అధికారులే అర్థమయ్యేలా చెప్పాలె. లేకుంటే వారే మా వివరాలు నమోదు చేయాలె.
– మేకల శ్రీనివాస్, హనుమంతునిపేట
జిల్లాలో పత్తి దిగుబడిరాక ఇంకా మొదలుకాలే. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న పత్తినే కొంటున్నాం. ఈసారి అమల్లో కి తెచ్చిన లింట్ పర్సేంటేజీ, షార్టేజీ విషయంలో తేడాలను సవరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– ముడుసు సాంబిరెడ్డి, కాటన్ అసోసియేషన్ నేత
రైతులు దిగుబడి వివరాలను కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఇందు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మా సిబ్బందిని రైతులకు సాయంగా ఉంచి అవగాహన కల్పిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి
 
							దిగుబడిపై ప్రభావం
 
							దిగుబడిపై ప్రభావం
 
							దిగుబడిపై ప్రభావం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
