 
															నీటిలో మునిగి వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మానేరువాగులో స్నానం చేసి బయటకు వస్తుండగా ఫిట్స్ వచ్చి నీటిలోనే వ్యక్తి చనిపోయిన సంఘటన పొత్తూరులో విషాదం నింపింది. మండలంలోని పొత్తూరుకు చెందిన బండారి వెంకటయ్య(48) కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం హమాలీ పనులు ముగించుకున్న తర్వాత గ్రామ పొలిమేరలోని మానేరువాగులో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగానే వెంకటయ్యకు ఫిట్స్ వచ్చి నీటిలోనే పడి మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మానేరువాగు వైపునకు వెళ్లిన గ్రామస్తులు వెంకటయ్య మృతదేహం చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై జి.లక్పతి తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.
● విద్యుత్ మోటార్ తీస్తుండగా నదిలో గల్లంతు
మంథనిరూరల్: ఓ రైతుకు చెందిన విద్యుత్‌మోటార్‌ను గోదావరి నదిలోంచి బయటకు తీసేందుకు యత్నించిన యువకుడు నీళ్లలో మునిగి మృతి చెందాడు. ఈఘటన మంథని మండలం ఖాన్‌సాయిపేట శివారులోని ఎల్‌మడుగులో చోటుచేసుకుంది. ఘటనలో ఖాన్‌సాయిపేటకు చెందిన గావిడి సూరి(25) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు మోటారు గోదావరి నదిలో చెడిపోయింది. దానిని బయటకు తీసేందుకు గావిడి సూరి, గిరిసంగ రాజును ఆ రైతు నది వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరు నదిలో దిగి మోటారును బయటకు తీయడం ఇబ్బందిగా మారడంతో రాజు ఒడ్డుకు వచ్చాడు. సూరి నదిలోని మోటారు తీసుకొ ప్రయత్నంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు లు, గ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బోట్‌ల సాయంతో గాలించగా సా యంత్రం సూరి మృతదేహం లభ్యమైంది. మొ సళ్లు సంచరించే ప్రాంతం కావడంతో సూరిని మొసలి లాక్కెల్లిందని తొలుత గ్రామస్తులు భావించారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీటిపర్వంతమయ్యారు, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
● ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం
కోరుట్ల రూరల్: మండలంలోని వెంకటాపూర్, మోహన్‌రావుపేట గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని పట్టణానికి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం వినోద్ వ్యవసాయ బోర్లు మరమ్మతు చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం కోరుట్ల నుంచి మోహన్‌రావుపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోతల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వినోద్‌కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
హుజూరాబాద్‌రూరల్: వెంకట్రావ్‌పల్లె గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు చింత సమ్మయ్య (46) బైక్‌పై పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమ్మయ్యన ఢీకొట్టిన వాహనదారుడు మెట్‌పల్లి గ్రానైట్ క్వారీలో పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.
సిరిసిల్ల: హైదరాబాద్‌లో జ రిగిన రోడ్డు ప్రమాదంలో సి రిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సు భాష్‌నగర్‌కు చెందిన బండా రి అశోక్–గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూ తురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇటీవల దసరా పండుగకు ఇంటికొచ్చి వెళ్లిన మనోజ్ఞ హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ తాగిన మైకంలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మనోజ్ఞ మృతదేహాన్ని సిరిసిల్లకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బంగారు భవిష్యత్ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది.
 
							నీటిలో మునిగి వ్యక్తి మృతి
 
							నీటిలో మునిగి వ్యక్తి మృతి
 
							నీటిలో మునిగి వ్యక్తి మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
