గోదావరిఖని: అంతర్గాంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన చౌరస్తాలో బా ణసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. ఎంపీ కృషితో పారిశ్రామిక ప్రాంతానికి ఎయిర్‌పోర్టు మంజూరవుతోందని నాయకులు అన్నా రు. ఫిజిబులిటీ రిపోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కా మ విజయ్, రఫీక్, వాసర్ల సురేందర్, హకీం, మధు. నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భగీరథ.. నీరు వృథాగా..
మంథనిరూరల్: ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో మిషన్‌భగీరథ నీళ్లు మురుగునీటి కాలువలో వృథాగా కలిసిపోవడం అధికారుల తీరుకు అద్దంపడుతోంది. తాగునీటి సమస్య తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గ్రామాల్లో ఇలా నీటిని వృథా చేయడంపై పల్లెవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామస్థాయి అధికారులు తాగునీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అంకమెట్టుకు పోటెత్తిన భక్తులు
పాలకుర్తి(రామగుండం): జయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని అంకమెట్టుగుట్టకు ఆదివారం భక్తులు పోటెత్తారు. రైతులపాలిట కొంగుబంగారంగా నిలిచే అంకమెట్టుగుట్టపై కొలువుదీరిన చిన్నయ్య–పెద్దయ్య దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి, ధర్మారం మండలాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
15న దుకాణాలకు వేలం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నవంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జాతరలో కొబ్బరికాయలు, లడ్డూలు, పులిహోర, పేలాలు, పుట్నాలు విక్రయించేందుకు ఈనెల 15న(బుధవారం) బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. రూ.100 చెల్లించి పొందిన దరఖాస్తు ఫారం నింపి ధరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు.
దళిత సంఘాల నిరసన
మంథని: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై దాడి, అ డిషనల్ డీజీ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలనే డిమాండ్‌తో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో ఆదివారం ధర్నా చేశారు. బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు మంథని లక్ష్మ ణ్, జక్కు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, దళి తవర్గాలు అటెండర్‌స్థాయి నుంచి ఐపీఎస్, ఐ ఏఎస్ స్థాయిలకు అధిగమించిన మనదేశంలో గౌరవం ఉండడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ వ ర్గాలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డి మాండ్‌తో బీసీ సంఘాలు ఈనెల 14న చేపట్టి న బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. నాయ కులు ఆరెపల్లి కుమార్, వేల్పుల గట్టయ్య, ఆవు నూరి లింగయ్య, దేవల్ల విజయ్ కుమార్, ఎరు కల రవి, ఆసం తిరుపతి, పొట్ల శ్రీకాంత్, నారమల్ల ధర్మేందర్, జక్కు శ్రావణ్ కుమార్, కడారి సంపత్, గువ్వల రాజశేఖర్, మంథని రాజపోశం, రాదండి శంకర్, పీక మల్లేశ్ పాల్గొన్నారు.
ఎంపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ఎంపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ఎంపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం