
సమన్వయం.. సత్వర సేవలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆస్ప త్రిలో ప్రసూతి సేవలు గణనీయంగా పెరిగాయి. గతంలో సగటున 147 ప్రసవాలు జరగ్గా.. ఈసారి ఒక్క సెప్టెంబర్‌లోనే రికార్డుస్థాయిలో 250 డెలివరీలు నమోదు అయ్యాయి. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలే చేసేలా వైద్యాధికారులు, సిబ్బంది చ ర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని మా తాశిశు కేంద్రంలో ప్రసూతి సేవలను పూర్తిస్థాయిలో ఉచితంగా అందిస్తుండడంతో ఎవరూ ప్రైవేట్ ఆస్ప త్రుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా సర్కార్ దవాఖానాల్లోనే ప్రసూతి సంఖ్యలు పె రుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వ్యాయామంతో ప్రయోజనం..
గర్భిణులకు మూడోనెల నుంచే ప్రత్యేక వ్యాయామాలు, యోగా చేస్తే సిజేరియన్‌తో పనిలేకుండా సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా గది అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ అంశాలపై గర్భిణులకు క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తున్నారు. తేలికపాటి వ్యాయామాలు, ప్రాణాయామం, వజ్రాసనం లాంటి సాధనాలను కౌన్సెలర్లతో చేయిస్తున్నారు.
అందుబాటులో శ్రీ‘టిఫా’ స్కాన్ సేవలు
గర్భిణులకు ప్రసూతి కోసం నెలవారీ పరీక్షల సమయంలో టిఫా స్కాన్ తప్పనిసరిగా చేస్తారు. ఈ స్కాన్ కోసం గతంలో అధిక వ్యయ, ప్రయాసలకోర్చి ప్రైవేట్ ల్యాబబోరేటరీలకు వెళ్లి పరీక్షలు చే యించుకోవాల్సి ఉండేది. ఇందుకు దాదాపు రూ.3 వేల దాకా ఖర్చయ్యేది. కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేక చొ రవతో మాతాశిశు ఆస్పత్రిలోనే టిఫా స్కానింగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో నయాపైసా ఖర్చు లేకుండా.. దూర ప్రాంతాలకు ఇబ్బందిపడుతూ వెళ్లే అవసరం తప్పింది. గత సెప్టెంబర్‌లో 123 టిఫా స్కానింగ్ సేవలు నిర్వహించడం విశేషం. రక్త, మూత్ర తదితర పరీక్షలు సైతం ఇక్కడి టీ హబ్‌లోనే చేసి ఫలితాలను కూడా రికార్డుస్థాయిలో.. గంటల్లోనే అందిస్తున్నారు.
నవజాత శిశుకేంద్రం ఏర్పాటు..
పుట్టిన పాపాయికి అవసరమైన వైద్యసేవల కోసం సంబంధిత కుటుంబీకులు ఆందోళనపడుతూ ప్రైవే ట్ ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే నవజాత శిశు కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఇప్పటివరకు 68 మంది నవజాత శిశువులకు వైద్యసేవలు అందించారు.
వైద్యులు, సిబ్బందిలో పెరిగిన అంకితభావం
ఎంసీహెచ్‌లో బాగా పెరిగిన ప్రసవాల సంఖ్య
ఒక్క సెప్టెంబర్‌లోనే రికార్డుస్థాయిలో 250 డెలివరీలు
మాతాశిశు కేంద్రంలోనే గర్భిణులకు టిఫా స్కాన్ సేవలు
వైద్యుల సేవలు భేష్
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రం వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఎంసీహెచ్‌లో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 250 ప్రసవాలు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. గర్భిణుల కోసం అన్నిరకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెలా చెకప్‌కోసం ఆస్పత్రికి వచ్చేందుకు 102 వాహనంలో వచ్చేలా ఆశ, ఏఎస్‌ఎంలు ప్రోత్సహించాలి. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అవసరమైన సేవలు నాణ్యంగా అందిస్తున్నారు. సాధారణ ప్రసవాలనే ఎక్కువగా ప్రోత్సహించాలి. రికార్డుస్థాయి ప్రసవాలు చేసిన వైద్యులు, సిబ్బందికి అభినందనలు.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్

సమన్వయం.. సత్వర సేవలు