
ప్రభుత్వమే నిర్వహించాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందం
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశా రు. స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు గౌతం గోవర్ధన్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరా ట చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకా ల్లో సిలబస్ చేర్చాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడేందుకు నాయకులు రావి నా రాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ ఇచ్చిన పిలుపు మేరకు వీరోచితంగా పోరాడి అనేకమంది అమరులయ్యారని అన్నారు. పూసాల రమేశ్, మానస్, నవీన్, ఉదయ్, అంజి, సదానందం, శంకర్, తిరుమల్, ఎల్లయ్య, రాజేశ్ ఉన్నారు.