
నేటి నుంచి వైద్యశిబిరాలు
పెద్దపల్లిరూరల్: మహిళల ఆరోగ్యం కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి స్వస్థ్ నారీ స్వశక్తి అభియాన్ పథ కం అమలుపై సమీక్షించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాలికల స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. డయాబెటిస్, బ్రెస్ట్‌క్యా న్సర్, హైపర్ టెన్షన్, సర్వికల్ క్యాన్సర్, ఎనీమి యా, టీబీ లాంటి వ్యాధుల నిర్ధారణకు పరీక్ష లు నిర్వహిస్తారని వివరించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో మాధ వి, డీడబ్ల్యూవో వేణుగోపాల్ పాల్గొన్నారు.
‘ఎల్లంపల్లి’కి భారీ ఇన్‌ఫ్లో
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మంగళవా రం ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వి డుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 19.20 టీఎంసీలు ఉందని నీటి పారు దల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, దిగు వన ఉన్న గోదావరి నదిలోకి 4.91 లక్షల క్యూ సెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ నుంచి అత్యధికంగా 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని వారు వివరించారు.
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపిక
కమాన్‌పూర్(మంథని): పోలీస్ కానిస్టేబుల్ కూరపాటి శ్రీలత ఆల్ ఇండియా పోలీస్ స్పో ర్ట్స్ మీట్‌లో యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఇందుకోసం పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకు నేందుకు వెళ్తున్నారు. ఆమెను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐ శ్రీనివాస్ మంగళవారం అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు.
యూరియా అందించాలి
రామగుండం: అన్నదాతలకు సరిపడా యూ రియా అందజేయాలని అఖిల భారత రైతు కూ లీ సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.చంద్రయ్య డిమాండ్ చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేటలోని రైతు కూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్ను ల యూరియా ఇవ్వాల్సి ఉండగా.. 5.30 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వడంతోనే కొరత ఏర్పడిందని విమర్శించారు. యూరియా కొరత తీర్చాలని, భారీవర్షాలతో పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఇ.నరేశ్, కొల్లూరి మల్లేశ్, ఎడ్ల రవికుమార్, బోనాల లింగయ్య, తూళ్ల లింగయ్య, ఆరుముళ్ల శంకర్, గట్టయ్య తదితరులు ఉన్నారు.
నియామకం
జ్యోతినగర్(రామగుండం): తె లంగాణ నేషన ల్ గ్రీన్‌కార్ప్స్ పర్యావరణ వి ద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా అంజన్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఎన్‌జీసీ డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఉత్తర్వులు జారీచేశా రు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్‌కుమార్.. పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, విద్యపై నిబద్ధత గురించి యువతకు అవగాహన కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం సమష్టి చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేటి నుంచి వైద్యశిబిరాలు

నేటి నుంచి వైద్యశిబిరాలు

నేటి నుంచి వైద్యశిబిరాలు