
గోద్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మీ ఠాకూర్
జ్యోతినగర్(రామగుండం): గోద్ ఫౌండేషన్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా మిస్ ప్లానెట్ ఇండియా రష్మీ ఠాకూర్‌ను నియమించారు. ఈమేరకు ఫౌండేషన్ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు మ మతా మెహంతా, వైస్ చైర్మన్ నిజామొద్దీన్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన రష్మీ ఠాకూర్ సేవా, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భ్రూణహత్యల నివారణ, ఆడపిల్లల సంరక్షణపై అవగాహన పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమన్నారు. చట్టాలను బలోపేతం చేయడం, మహిళా చట్టాల అమలుకు కృషి చేయడం, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా అవగాహన కల్పించడం తన బాధ్యతని రష్మీ ఠాకూర్ వివరించారు.