విస్తరిస్తున్న క్షయ! | - | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న క్షయ!

Sep 17 2025 7:45 AM | Updated on Sep 17 2025 7:45 AM

విస్త

విస్తరిస్తున్న క్షయ!

● మధ్యలో మందులు మానేస్తున్న పేషెంట్ల ● చిన్న పిల్లల్లోనూ బయటపడుతున్న వ్యాధి లక్షణాలు

● మధ్యలో మందులు మానేస్తున్న పేషెంట్ల ● చిన్న పిల్లల్లోనూ బయటపడుతున్న వ్యాధి లక్షణాలు

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో క్షయ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకూ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారే టీబీ బారిన పడుతుండే వారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తితో కొన్నేళ్లుగా చిన్నారులు కూడా క్షయ పీడితులవుతున్నారు. బాధితుల్లో కొంతమంది మధ్యలో చికిత్స ఆపేస్తుండడంతో వ్యాధి మళ్లీ తిరగబెడుతోందంటున్నారు. తర్వాత ముదిరి మొండిగా మారి ప్రాణాలు తీస్తోంది. క్షయ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నాయి.

క్షయబారిన 87 మంది చిన్నారులు

జిల్లాలో గత నాలుగేళ్లలో 4,805 మంది క్షయ బారినపడగా, అందులో 87 మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా టీకా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత పిల్లలు ఇంకా ఉండడమేమిట న్నది జవాబులేఇ ప్రశ్నగా మారింది. ప్రభుత్వ, ప్రై వేట్‌ ఆస్పత్రులతోపాటు ఇళ్లవద్ద కాన్పు జరిగిన శి శువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా సర్కార్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చాపకింద నీరులా..

జిల్లాలో క్షయ నిర్మూలన కోసం అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టడం లే దు. వేళకు మందులు వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డాక్టర్ల సూచనల మేరకు నడక, వ్యా యామం చేయడం వంటివి క్రమం తప్పకుండా చే సిన వారు చాలావరకు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. మరికొందరు రెండు, మూడు నెలల్లో వ్యాధి లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తున్నారు. దీంతో చాలామందిలో వ్యా ధి తిరగబెడుతోంది. తీవ్రత ఆధారంగా డ్రగ్‌ సెన్సిటివ్‌ టీబీ, డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ గా విభజించారు. డ్రగ్‌ సె న్సిటివ్‌ టీబీకి ఆరునెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండగా, డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీకి వ్యాధి తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వ్యాధి లక్షణాలివే..

క్షయ ఒక అంటువ్యాధి. పేషెంట్‌ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎవరికై నా వ్యాధి సోకితే రెండువారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు, ఆకలి తగ్గుదల ఉంటుంది. దగ్గినప్పుడు క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఉమ్మినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గుర్తి స్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి.

పిల్లల్లో లక్షణాలు

పెద్దల్లో మాదిరిగా తీవ్రదగ్గు ఉండదు. ఆకలి తగ్గిపోతుంది. అన్నం తినాలని బలవంతం చేస్తే ఏడుస్తా రు. పిల్లల్లో వయస్సుకు తగ్గట్లుగా ఎదుగుదల ఉండదు. బరువు పెరగరు. సాయంత్రం వేళల్లో జ్వరం వస్తుంది. మెడ పక్కన లింపు గ్రంథుల్లో వాపు, గడ్డల్లాగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

జిల్లా సమాచారం

ఏడాది 2022 2020 2024 2025 (ఇప్పటివరకు)

టెస్టులు 23,880 23,694 22,956 14,670

కేసులు 1,291 1,426 1,246 842

15ఏళ్లలోపు 32 29 13 13

మరణాలు 73 41 43 12

సకాలంలో గుర్తించాలి

క్షయ అనుమానితులకు ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందుల పంపిణీతోపాటు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు త్వరగా రికవరీ అవుతున్నారు. క్షయను సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే తప్పకుండా అదుపులోకి వస్తుంది.

– సుధాకర్‌రెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి

విస్తరిస్తున్న క్షయ!1
1/1

విస్తరిస్తున్న క్షయ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement