
విద్యాప్రమాణాలు పెంచాలి
కమాన్‌పూర్(మంథని): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కనీస విద్యాప్రమాణాలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కమాన్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం ఆయన గణిత ప్రయోగశాల ప్రారంభించారు. పేరపల్లిలో ప్రభుత్వ పాఠశా ల, ఆరోగ్య ఉపకేంద్రం, రొంపికుంట ప్రభుత్వ పా ఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీఏసీఎస్ కార్యాల యాలను సందర్శించారు. విద్యా బోధన తీరుపై ఆ రా తీశారు. పదో తరగతి చాలా కీలకమని, ప్రతీ విద్యార్థి బాగా చదివి ఉన్నతంగా స్థాయికి ఎదగా లని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎరువుల కొరత రా కుండా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవా లని సూచించారు. జిల్లా సహకార అధికారి శ్రీమా ల, మంథని డీఎల్‌పీవో సతీశ్, డిప్యూటి డీఎంహెచ్‌వో రవిసింగ్, ఎంపీడీవో లలిత, ఎంపీవో మారుతి, ఎంఈవో విజయ్‌కుమార్, ఏవో రామకృష్ణ, డీఈలు రాజ్‌కుమార్, దస్తగిరి, ఏఈ మధు, కార్యదర్శులు ప్రసాద్, తిరుపతి, ఉపాధ్యాయులు భరత్‌కుమార్, గసిగంటి రమేశ్, రాజేశ్వరరావు, సతీశ్, శంకర్, రజినివందన, రజితకుమారి, రేణుక, స్రవంతి, ఈశ్వరయ్య, నంబయ్య తదితరులు ఖలీక్ ఉన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష