
● వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి
గోదావరిఖని: అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సూచించారు. స్థానిక ఇందిరానగర్‌లో సోమవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ పోగ్రాం నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు చేశారు. ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను సీజ్‌చేసి యజమానులకు జరిమానా విధించారు. ఇతర రాష్టాలు, ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పనులు చేసేవారు ఎక్కువమంది ఈప్రాంతంలోనే నివాసం ఉంటున్నారని, ఇళ్లు అద్దెకు ఇచ్చే వారు వలసవచ్చే వారిపూర్తి వివరాలు, ఎక్కడ నుంచి వచ్చారు, గతంలో ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతీఒక్కరు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలు నియంత్రణకు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.