
క్రీడాకారుడికి కాంపౌండ్‌బో
పెద్దపల్లిరూరల్: నైపుణ్యం గల క్రీడాకారుల ఆసక్తికి అనుగుణంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్చరీ క్రీడాకారుడు తానిపర్తి యశ్వంత్‌కు రూ.4,30,800 వెచ్చించి కొనుగోలు చేసిన అంతర్జాతీయ నైపుణ్యాలతో కూడిన కాంపౌండ్‌బో పంపిణీ చేశారు. జిల్లా క్రీడల అధికారి సురేశ్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సాంకేతిక నైపుణ్యం అవసరం
రామగిరి(మంథని): ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు అధ్యాపకులు కూడా ఆధునిక సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని జే ఎన్టీయూ ప్రిన్సిపాల్ బులు సు విష్ణువర్ధన్ సూచించా రు. ఎడ్యునెట్ ఒప్పందంలో భాగంగా కాలేజీలోని 18 మంది అధ్యాపకులకు సాంకేతికత, బోధన నైపుణ్యం మెరుగుపర్చేందుకు మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఐదురోజుల శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎడ్యునెట్ కింద ఎంపికై న 40 మంది వి ద్యార్థులకు శిక్షణ పొందిన అధ్యాపకులు తర్ఫీ దు ఇస్తారని వివరించారు. ఉద్యోగాలు, ఇంటెర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే వారికి సహాయ, సహకారాలు అందిస్తామని ప్రోగ్రాం ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు. ఎడ్యునెట్ ప్రతినిధులు సుమిత్, పవన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఐటీఐలో మలివిడత ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల లో మలివిడత ప్రవేశాలకోసం ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలి పారు. ఆగస్టు 1 నాటికి 14 ఏళ్ల వయసు నిండి టెన్త్, ఎనిమిదో తరగతి చదివి ఉండాలన్నారు. రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు పొందాలన్నారు. వెబ్ ఆప్షన్ల ఽఆధారంగా సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాల కోసం 85004 63969 నంబరులో సంప్రదించాలని సూచించారు.
కాంగ్రెస్‌తోనే సొంతిల్లు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటికల సాకారం అవుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. రామునిపల్లి, కనుకుల, మంచిరామి గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బుధవా రం ఆయన ముగ్గు పోశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పీఏసీఎస్ జిల్లా డైర్టెకర్ కల్లెపల్లి జానీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు.
గట్టుసింగారం.. ఇక పర్యాటకం
పెద్దపల్లిరూరల్: సబ్బితం గ్రామశివారు గట్టుసింగా రం జలపాతం ప ర్యాటకంగా మారనుంది. జలపాతా న్ని అభివృద్ధి చే సేందుకు ప్రభు త్వం రూ.6కోట్లు కేటాయిస్తూ బుధ వారం ఉత్తర్వులుజారీ చేసింది. స్థానిక ఎమ్మె ల్యే విజయరమణారావు విన్నపం మేరకు హై దరాబాద్‌లోని పర్యాటక శాఖ ఉన్నతాధికారు లు సబ్బితం జలపాతానికి గతంలోనే చేరుకుని ప్రతిపాదనలు రూపొందించారు. ఆ మేరకు ప్ర భుత్వం నిధులు మంజూరు చేసింది. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.4.50 కోట్లతో పర్యాటక అభివృద్ధి, రూ.1.50కోట్లతో అటవీశాఖ ఆధ్వర్యంలో మరిన్ని పనులు చేపట్టనున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి శ్రీధర్‌బాబుకు ఎమ్మెల్యే విజయరమణారావు కృతజ్ఞతలు తెలిపారు.
‘స్థానికం’లో బీజేపీదే విజయం
పెద్దపల్లిరూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీలో చేరారు. రామకృష్ణారెడ్డి, సంజీవరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. అనంతరం మాట్లాడారు.

క్రీడాకారుడికి కాంపౌండ్‌బో

క్రీడాకారుడికి కాంపౌండ్‌బో

క్రీడాకారుడికి కాంపౌండ్‌బో

క్రీడాకారుడికి కాంపౌండ్‌బో