
ముసురుతున్న వ్యాధులు
● బాధిస్తున్న జ్వరం.. దగ్గు.. టైపాయిడ్ ● వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలతో జనం విలవిల ● ఆస్పత్రులకు పేషెంట్ల బారులు ● టెస్ట్‌ల పేరిట ప్రైవేట్ ఆస్పత్రుల బాదుడు ● పరిసరాల పరిశుభ్రత పాటించాలి ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సూచన
సాక్షి పెద్దపల్లి: వాతావరణం మారుతోంది. వైర ల్‌ఫీవర్, టైఫాయిడ్ జ్వరాలు పంజా విసురుతున్నా యి. కొన్నిరోజులుగా కురుస్తున్న ముసురు, మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన భారీ వర్షంతో జిల్లావాసులు సీజనల్ వ్యాధుల బారినపడుతున్నా రు. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడు తూ వైద్యం కోసం వస్తున్న వారితో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ఏరియా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రద్దీగా మారాయి. సర్కారు దవాఖానాల్లో ఓ పీ కేసులు అధికంగా నమోదవుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యపరీక్షల పేరిట పేషెంట్ల జేబులు గుళ్లచేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 24 టైపా యిడ్ కేసులు, 2 డెంగీ కేసులు నమోదయ్యాయి.
ఫీవర్ తగ్గుతోంది.. దగ్గు వెంటాడుతోంది..
వైరల్ ఫీవర్ నాలుగైదు రోజుల్లో తగ్గుతున్నా దగ్గు, జలుబు రెండు వారాలకుపైగా బాధితులను పట్టి పీడిస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ 2 వేలు, ప్రైవేట్‌లో 1,500 నుంచి 2 వేల వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 100 నుంచి 150 వరకు జ్వరంతో బాధపడుతున్న పిల్లలు ఉంటున్నారు. నిత్యం 500కుపైగా రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జ్వరపీడితుల్లో పలు లక్షణాలు కనిపిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు..
ఆస్పత్రులను ఆశ్రయించేవారిలో అత్యధికులు జ్వరపీడితులే ఉంటున్నారు. పది రోజులుగా ఏ ఆస్పత్రిలో చూసినా సాధారణం కన్నా అధికంగా ఓపీలు నమోదవుతున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా, లేకున్నా బాధితుల నుంచి శాంపిళ్లు సేకరిస్తూ రక్తం, మూత్ర పరీక్షలు చేస్తూ, అడ్మి ట్ చేసుకుంటూ రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.
టైపాయిడ్ లక్షణాలు..
● తలనొప్పి, చలి, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, దగ్గు రావడం, శరీరంపై గులాబీ మచ్చలు కనిపిస్తాయి.
● కండరాల నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, మలబద్ధకం ఉంటాయి.
కారణాలు..
కలుషితనీరు తాగడం, అపరిశుభ్రత వాతావరణం, ఈగలు ముసిరిన రోడ్డుపక్కన ఉండే తినుబండారాలతో టైఫాయిడ్ జ్వరం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈగల ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాతో టైఫాయిడ్ వస్తుంది. బాధితుల పేగుల్లోకి అది చేరుతుంది. బాధితులు బహిరంగ ప్రదేశాల్లో విసర్జించిన మల, మూత్రాలపై వాలిన ఈగలతో ఇతరులకూ టైఫాయిడ్ సోకుతుంది.
గోదావరిఖని జనరల్
ఆస్పత్రిలో నమోదైన ఓపీ కేసులు
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. తొలివిడతలో ఇంటింటి సర్వే చేశాం. అవసరమైన వారికి వెంటనే మందు లు పంపిణీ చేశాం. జ్వర బాధితులు సమీప సబ్ సెంటర్, పీహెచ్‌సీలను సంప్రదించండి. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. రక్తపరీక్షలు చేసి అత్యవసరమైతే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. అందరూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలి.
– అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌వో
తేదీ ఓపీ
23 1,052
22 1,332
21 1,035
19 1,071
18 1,117
17 1,025
16 1,154
15 1,304

ముసురుతున్న వ్యాధులు