
అభివృద్ధే ధ్యేయం : ఠాకూర్
గోదావరిఖని: నగర అభివృద్ధే ధ్యేయంగా ముందు కు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎ స్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక లక్ష్మీనగర్‌లో ఆ యన బుధవారం పర్యటించారు. రోడ్ల విస్తరణ, డ్రై నేజీ వ్యవస్థ, వీధిదీపాల మరమ్మతు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, శంకర్‌నాయక్, ముస్తాఫా ఉన్నారు.
‘మహాలక్ష్మి’ మహిళల గౌరవానికి సూచిక
గోదావరిఖనిటౌన్: మహాలక్ష్మి పథకం మహిళల గౌరవానికి, సమాజంలో సమాన హక్కులకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6,680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఈ వేడుక నిర్వహించామని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం పాల్గొన్నారు. అంతకుముందు ఆషా ఢ మాసం బోనాల్లో ఎమ్మెల్యే ఠాకూర్ పాల్గొన్నారు.
విద్యా సంస్థల బంద్ ప్రశాంతం
పెద్దపల్లిరూరల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సందీప్, ప్రశాంత్, ప్రీతం, సాయిరాం మాట్లాడుతూ, బంద్ విజవంతమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిపు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాలని కోరారు. నాయకులు అరవింద్, ఆదిత్య, సాయి, మధుకర్, నితిన్, వినయ్, రాజు, మనోహర్, నరేశ్, శివ, ప్రణయ్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధే ధ్యేయం : ఠాకూర్