దంచికొడుతున్న వాన | - | Sakshi
Sakshi News home page

దంచికొడుతున్న వాన

Jul 24 2025 8:41 AM | Updated on Jul 24 2025 8:41 AM

దంచికొడుతున్న వాన

దంచికొడుతున్న వాన

బల్దియాలో హెల్ప్‌లైన్‌

కోల్‌సిటీ(రామగుండం): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో స హాయక చర్యల కోసం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితులు 93924 83959 లేదా 96036 66444 నంబర్లలో సంప్రదించాలని బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

పెద్దపల్లిలో టోల్‌ఫ్రీ నంబరు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో కురుస్తున్న వానలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబరు 63031 27484కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ కోరారు. పురాతన ఇళ్లు వాననీటికి తడిసి కూలే ప్రమాదం ఉందని, అందులో నివాసం ఉండేవారు ఖాళీచేసి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement