
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత
గోదావరిఖని: జిల్లాలో మంగళవారం రాత్రి ప్రారంభమైన భారీవర్షం బుధవారం రాత్రివరకూ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు తెరిపిచ్చినా.. ఆ తర్వాత దంచికొడుతోంది. ఫలితంగా జిల్లాలోని కొన్నిపల్లపు ప్రాంతాల్లోకి వర్షపునీరు వచ్చిచేరింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు రావడం ఆరంభమైంది.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..
భారీవర్షాలతో సింగరేణిలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాక్షింగా, బుధవారం పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తం 18 ఓసీపీల్లో 1.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్, సింగరే ణి యంత్రాల ద్వారా ఓసీపీల్లో రోజూ 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉండగా ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఓసీపీ క్వారీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో భారీపంప్‌ల ద్వారా బయటకు తోడేస్తున్నారు. ఓసీపీల్లో సుమారు 62 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రౌండ్‌స్టాక్ కోల్‌ను సీహెచ్‌పీల ద్వారా రైల్వే నుంచి కస్టమర్లకు రవాణా చేస్తోంది.
అధికారులు అప్రమత్తం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. జేసీబీ సాయంతో నీటిని తొలగించారు. తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎస్సై శ్రవణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఇళ్లను ముంచెత్తిన వరద..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మల్యాలగూడెం, కొత్తపల్లి– మల్యాల మధ్య కల్వర్టులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పెగడపల్లిలోని పలువురి ఇళ్లలోకి వర్షపునీరు వచ్చిచేరింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షపునీళ్లు తొలగించాలని పలువురు మహిళలు అధికారులకు మొరపెట్టుకున్నారు. వర్షాలతో రైతులు, ప్రజల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని తహసీల్దార్ జగదీశ్వరరావు, ఏఎస్సై నీలిమ సూచించారు.
ఓదెలలో భారీవర్షం
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, గుంపుల, గూడెం, పొత్కపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతోంది. గూడెంలో పంటలు నీట మునిగాయి. కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్యలోని ఓదెల రైల్వే అండర్‌బ్రిడ్జి వర్షపునీటితో నిండిపోయింది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
జూలపల్లిలో 74.2మి.మీ. వర్షం
ధర్మారం/జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): జూలపల్లిలో 74.2 మి.మీ., ధర్మారంలో 79.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. ఎలిగేడు మండలంలో తెల్లవారుజామున ప్రారంభమైన జోరువాన ఉదయం 7 గంటల వరకూ ఏకధాటిగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మానేరు ఉధృతి.. తెగిన తాత్కాలిక రోడ్డు
ముత్తారం(మంథని): ముత్తారం మండలం ఓడేడు సమీపంలోని మానేరులో పోసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. దీంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మధ్య రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత

● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత