
● త్వరలోనే ఏర్పాటుకు చర్యలు ● మైనార్టీల సంక్షేమంపై ప్రత
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభయం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని మీర్జా అహమద్ బేగ్ నివాసంలో సోమవారం రాత్రి మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీలకు మీర్జా మహమ్మద్ బేగ్ కుటుంబం ఐదేళ్లుగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏ ర్పాటు కోసం ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అడ్లూరి హామీ ఇచాచరు. మీర్జా మహమ్మద్ బేగ్‌తోపాటు మోహిబ్‌బేగ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ బొంకూరి సుదర్శన్, ఏఈ రవీందర్, ప్రతినిధులు మున్నాభాయి, జావీద్, మొయిద్, హాదీ సంజీవ్, అజీజ్, సారయ్య, శ్రీమాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.