
సుదర్శన హోమం ప్రారంభం
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంకాలనీ శ్రీసత్యసాయి మందిరంలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించే మహాసుదర్శన హోమం సోమవారం ప్రారంభమైంది. సంస్థ జిల్లా అధ్యక్షుడు తుడి శ్రావణ్ కుమార్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పలు రాష్ట్రాల పీఠాధిపతులు హాజరయ్యారు. తొలిరోజు మహాగణపతి పూజ, హోమం, స్వస్తిపుణ్య హవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. లోక కల్యాణార్ధం ఈ కార్యక్రమం చేపట్టారు. రాజరాజేశ్వర పీఠాధిపతి అంబికేశ్వరానంద స్వామి, త్రిశక్తి షణ్ముఖానందస్వామి, కరుణానందగిరి స్వామి, మాతా మహేశ్వరి, అభినవ కల్యాణనంద భారతీస్వామి, రాఘవేంద్రస్వామి, భక్తులు అరవింద్, కోమల మహేశ్, మచ్చ విశ్వాస్, మీసాల కృష్ణ, కుమారస్వామి, అమ్మ రాజు, మల్లేశ్వర్‌రావు, శంకరయ్య, బంగారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.