వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు | - | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు

Jul 22 2025 6:36 AM | Updated on Jul 22 2025 9:29 AM

వీడియ

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు మన జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పలువురు జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ, సాగుకు అవసరమైనంత మేరకే యూరియా తీసుకోవాలని, ఇతర అవస రాల కోసం పక్కదారి పట్టిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వీడియో కా న్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అడిషనల్‌ కలెక్టర్‌ వేణు, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, డీఎస్‌వో శ్రీనాథ్‌, డీఏవో శ్రీనివాస్‌, ఆర్డీవో గంగయ్య, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించండి

రామగిరి(మంథని): సుమారు 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సింగరేణిలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు డిమాండ్‌ చేశారు. సోమ వారం ఆర్జీ–3 ఏరియాలోని ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. యాజమా న్యం ప్రకటించిన టెండర్ల ద్వారా వస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలు కొత్తగా నలుగురిని నియమించుకుంటున్నాయని, వారిరాకతో నెలకు 15 – 20 మస్టర్లు తమకు అందడంలేదన్నారు. తక్కువ మస్టర్లతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి కనీసం 26 మస్టర్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు రాజేందర్‌, ఉడుత శంకర్‌, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఖరారు చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా అత్తె రాజారాం(కాల్వశ్రీరాంపూర్‌), ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేశ్‌(అంతర్గాం టీటీఎస్‌)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా వెంకటస్వామి(అప్పన్నపేట) అసోసియేట్‌ ప్రె సిడెంట్‌గా రాచర్ల శ్రీనివాస్‌, ఆర్థిక కార్యదర్శిగా పులి శ్రీనివాస్‌రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా పి ల్లలమర్రి సత్తయ్య, దూస మల్లయ్య, రాచకొండ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా వెంకటేశం, కృష్ణారెడ్డి, అంజనీదేవి, మంజులత, ఎస్తర్‌, కార్యదర్శులుగా సముద్రాల ప్రవీణ్‌కుమార్‌, రాజమ ణి, శ్యాంకుమార్‌, రమేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. రా ష్ట్ర నాయకులు శ్రవణ్‌రెడ్డి, మల్లన్న, మధుసూదన్‌రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించా రు. కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

యువతకు ఉచిత శిక్షణ

పెద్దపల్లిరూరల్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌ 1, 2, 3, 4తోపాటు ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు ఆగస్టు 25 నుంచి ఉచిత కోచింగ్‌ అందిస్తామని జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి రంగారెడ్డి సోమవారం తెలిపారు. 150 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, అభ్యర్థులకు నెలకు రూ.1,000 స్టైఫండ్‌ చెల్లిస్తారన్నారు. ఆసక్తిగలవారు ఆగస్టు 11లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కోసం...

పోస్ట్‌మెట్రిక్‌, జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కాలేజీల్లో చదివే మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ వెల్ఫేర్‌ ఇన్‌చార్జి అధికారి రంగారెడ్డి కోరారు. ప్రెష్‌, రెన్యూవల్‌ కోసం దరఖాస్తుచేసిన వారు హార్డుకాపీలను సంబంధిత కాలేజీలో అందించాలని ఆయన సూచించారు.

సుల్తానాబాద్‌లో భారీవర్షం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు సమీపంలోని పలు గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీవర్షం కురవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఉక్కపోతతో ఇబ్బంది ఎదుర్కొన్న మండల ప్రజలు.. వర్షంతో వాతారవణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు 1
1/2

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు 2
2/2

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement