● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవం
‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్ ధోని.
మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్‌ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న
సందర్భంగా కథనం.. –కరీంనగర్‌టౌన్
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!