
భవిత కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: భవిత కేంద్రాల్లోని దివ్యాంగుల కు వసతులు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. పా ఠ శాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) ద్వా రా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమో దు చేయాలన్నారు. విద్యార్థుల హాజరు 68 శా తం నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఎంఈవోలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికే వా రిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. భూ సమస్యలను రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులు 3, 5 తరగతుల్లో బెస్ట్ అవైలెబుల్ స్కూల్‌లో చేరేందుకు ఈనెల 26 లో గా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించా రు. వివరాలకు 96521 18867 ఫోన్‌నంబరులో సంప్రదించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీఈవో మాధవి, డీఎఫ్‌వో శివయ్య, ఏడీ సర్వే ల్యాండ్స్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
అంతర్గాంలో సుడిగాలి పర్యటన
రామగుండం: అంతర్గాం మండలం మద్ధిర్యాల, పొట్యాల, బ్రాహ్మణపల్లి, గోలివాడ గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం సుడిగాలి పర్యటన చేశారు. మద్ధిర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పురోగతి పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్ర భుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీ చేశారు. పొట్యాల, బ్రాహ్మణపల్లి, గోలివాడ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై ఆరా తీశారు. పారిశుధ్యం నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ, డీఈలు రాజేశ్వర్, దస్తగిరి, పీఆర్ డీఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.