
రేపు ఓదెలలో కోర్టు ప్రారంభం
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న జూనియర్ సివిల్ కోర్టును ఈనెల 13న(ఆదివారం) ప్రారంభించనున్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కోర్టును ప్రారంభిస్తారు. కోర్టు అందుబాటులోకి వస్తే.. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల పరిధిలోని సివిల్, క్రిమినల్ కేసులు సుమారు 1,500 వరకు త్వరితగతిన పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని ఓ అద్దె భవనంలో కోర్టు ఏర్పాటు చేశారు. ఓదెల కోర్టు ఇన్‌చార్జి జడ్జిగా సుల్తానాబాద్‌కు చెంది న జూనియర్ సివిల్ జడ్జి గణేశ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కోర్టు ప్రారంభోత్సవం ఏ ర్పాట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత శుక్రవారం సమీక్షించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరవుతారు.