
మహిళలు సభ్యులుగా చేరాలి
ఎలిగేడు(పెద్దపల్లి): స్వశక్తి సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన ప్రతీ పేద మహిళను గుర్తించి సంఘంలో సభ్యురాలిగా చేర్పించాలని డీఆ ర్‌డీవో కాళిందిని సూచించారు. కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలను టీ సెర్ప్, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీఆర్‌డీవో కాళిందిని హాజర య్యారు. మహిళా శక్తి సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు బొట్టుపెట్టి పూలబొకేతో ఆహ్వానించారు. సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈనెల 18వ తేదీవరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులతోపాటు ఏపీఎం సుధాకర్ సీసీలు గీస ఆనంద్, మల్లేశం, జ్యోతి, గ్రామసంఘం అధ్యక్షులు, వీవోఏలు, స్వశక్తి సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అంతర పంటలు వేయాలి
ముత్తారం(మంథని): ఆయిల్‌పామ్‌లో అంతర్ పంటలు పండిస్తూ అదనపు ఆదాయం పొందా లని హార్టికల్చరల్ ఆఫ్ డైరెక్టర్ జిల్లా ప్రత్యేకాధికారి శేఖర్ రైతులకు సూచించారు. అడవిశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడులోని ఆయిల్‌పా మ్ తోటలను శుక్రవారం ఆయన పరిశీలించా రు. టమాట, వంకాయ, బెండ, సొరకాయ, బీ రకాయ సాగు చేస్తే అదనపు ఆదాయం స మకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు జ్యోతి, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్ అజయ్, అనిల్, రైతులు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ టూర్‌కు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు
మంథనిరూరల్: ఎగ్లాస్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ వి ద్యార్ధులు శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూ ర్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా ఈ పర్యటన చేపట్టా రు. ఆరు నుంచి పదోతరగతి చదువుతున్న వి ద్యార్ధులు ఉపాధ్యాయులతో కలిసి వెళ్లారు. ప వర్ జనరేషన్, వాటర్ స్ట్రీమింగ్ తదితర అంశా ల గురించి సిబ్బంది వివరించారు. హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, మంథని రాజశేఖర్, ములకల రాజశేఖర్, మంజుల, అనిత, ధనుంజయ్ పాల్గొన్నారు.
మోడల్ రీడింగ్ పద్ధతిన బోధన
జ్యోతినగర్(రామగుండం): మోడల్ రీడింగ్ విధానంలో విద్యాబోధన చేయాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి షేక్ సూచించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో రెండు రోజులుగా ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్)పై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పిల్లలకు చదవడం, నేర్పించడానికి వివిధ పద్ధతులను వివరిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్పీలు రఘబాబు, శ్రీనివాస్, రాజేశ్, రాజిరెడ్డితోపాటు ఎంఈవో చంద్రయ్య, ప్రధానోపాధ్యాయులు జయరాజు, శారద, భూమయ్య, సీఆర్పీ రామ్‌కుమార్, గౌస్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
సుల్తానాబాద్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డీఈవో మాధవి సూచించారు. గర్రెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ శిబిరాన్ని డీఈవో శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు నేర్పించాలని అన్నారు. ఎన్‌ఏఎస్–2024 సర్వే నివేదికలో మనజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలిపారు. ఎంఈవో రాజయ్య, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్, రత్నాకర్‌రెడ్డి, కవిత పాల్గొన్నారు.
సంబురాల్లో డీఆర్డీవో కాళిందిని, సిబ్బంది

మహిళలు సభ్యులుగా చేరాలి

మహిళలు సభ్యులుగా చేరాలి