
మొక్కలు నాటి సంరక్షించాలి
పెద్దపల్లిరూరల్: ప్రతీపౌరుడు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో శుక్రవారం వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నా టారు. అనంతరం మాట్లాడారు. ఎటూ చూసి నా పచ్చదనం కనిపించేలా నాటుతున్న 550 మొక్కలను సంరక్షించాలని వారు సూచించారు. కొత్తకాలనీల్లో రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అఽధికారి శివయ్య, ఆర్టీవో రంగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఎంసీ చైర్‌పర్సన్లు స్వరూప, ప్రకాశ్‌రావు, తహసీల్దార్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ స్ఫూర్తితో కోటీశ్వరులను చేస్తాం
సుల్తానాబాద్‌రూరల్: దివంగిత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరా క్రాంతి ప థం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కదంబపూర్, తొగర్రాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. అనంతరం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నారని, ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బ్యాంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులతో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి తిన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, నాయకులు జానీ, అబ్బయ్యగౌడ్, దామోదర్‌రావు, శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లా కేంద్రంలో ఘనంగా వన వమహోత్సవం

మొక్కలు నాటి సంరక్షించాలి