
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె..
● 13న పెద్దపట్నం.. 14న అగ్నిగుండాలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు ఈనెల13న జరుగుతాయి. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపస్థాపన, వీరభద్రారాధన రాత్రి భద్రకాళి అవాహన, రాత్రి 10 నుంచి పెద్దపట్నం కార్యక్రమం ప్రారంభమవుతోంది. 14న వేకువజామున 5గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన దాటుట, దక్షయాగ కథాశ్రవణం నిర్వహిస్తారు.
ముస్తాబైన ఆలయం
భక్తులకు కొంగు బంగారం ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు, అగ్నిగండం దాటుట కార్యక్రమాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లికార్జునస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులు, సీతారామచంద్రస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఉత్తరతెలంగాణ జిల్లాలతో పాటు పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. కరీంనగర్, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఓదెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే సికింద్రాబాద్, కా జీ పేట్, భద్రాచలం నుంచి ఓదెల మీదుగా వచ్చే ఇంటర్‌సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, సిర్‌పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సౌకర్యం కూడా ఉంది.
ఏర్పాట్లు చేశాం
ఓదెల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశాం. పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
– బి.సదయ్య, ఈవో, ఓదెల

మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె..

మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె..