
ప్రాణం తీసిన భూ తగాదా
● వరుసకు అన్నపై తమ్ముడి దాడి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ధర్మపురి: భూతగాదాలో గొడవ పడి వరుసకు అన్న అయిన రవిపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని దోనూర్‌కు చెందిన గొళ్లెన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. వారి మధ్య కొంతకాలంగా ఇంటిస్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా నిర్మాణం చేపడుతున్నాడు. గురువారం ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు రవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.