
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కమాన్‌పూర్(మంథని): ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని డీపీఎం వెంకటరమణ మహిళా సంఘాలకు సూచించారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఆదివరాహ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబురాలు జరుపుకున్నారు. డీపీఎం మాట్లాడుతూ స్వశక్తి మహిళా సంఘాలకు ప్రభుత్వం లోన్ బీమా, ప్రమాద బీమా, ఇందిరా మహిళా బస్సు, మహిళా క్యాంటీన్, పెట్రోల్ బంక్, సోలార్ యూనిట్స్, వడ్డీలేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాల వంటి వాటిల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆయన అన్నారు. మహిళ శక్తి మండల అధ్యక్షురాలు నంది శీరిష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజశాంతి, వీవోలు, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.