
సమ్మెకు కార్మిక సంఘాలు సై
జ్యోతినగర్(రామగుండం): సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కోరారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు రోడ్డులో మంగళవారం సమ్మె పోస్టర్లు పంపిణీ చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. కార్మిక చట్టాలను కుదించే యత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో బుధవారం చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, భూమయ్య, జమీల్, గీట్ల లక్ష్మారెడ్డి, రాధారపు రాజమల్లయ్య, ఏలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.