
సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం (ఈనెల 9న) జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు టోకెన్ సమ్మె ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటపొలాలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను ఎత్తిపోసి పంటపొలాలకు సాగునీరు అందించాలన్నారు. లేదంటే నీటి కోసం మరో ఉద్యమం చెస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పంపింగ్ మెదలుపెట్టి సుందిళ్ల అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వచేయాలన్నారు. సమావేశంలో నాయకులు గోపు అయులయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, నీరటి శ్రీనివాస్, పిల్లి రమేశ్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, జిట్టవేన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.