
మా బతుకులను రోడ్డు పాలు చేయద్దు
మంథని/రామగిరి: ‘మా భముల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుతో మా బతుకులను రోడ్డుపాలు చేయొద్దు’ అని మేడిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంథని ఆర్డీవో సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో అభివృద్ధి పేరుతో సింగరేణి సంస్థ సుమారు 400 ఎకరాలు, కృషివిజ్ఞాన కేంద్రం పేరుతో 170 ఎకరాలు సేకరించిందన్నారు. మంథని నియోజకవర్గం అబివృద్ధి చేయడానికి కేవలం రత్నాపూర్ మాత్రమే కనిపిస్తుందా..? మిగితా గ్రామాలు, మండలాలు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు. స్థానిక నాయకులు స్వార్థ ప్రయోజనల కోసం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కొండు లక్ష్మణ్, కృష్ణమూర్తి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.