
ఊరూరా మొహర్రం
పెద్దపల్లి జిల్లాలో మొహర్రం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పీర్ల ఊరేగింపులో మంథని, రామగుండంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధూకర్, కోరుకంటి చందర్ పాల్గొన్నారు. మొహర్రం కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక అని వారు అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు గోపు అయిలయ్య యాదవ్, నారాయణదాసు మారుతి, అర్షనపల్లి శ్రీనివాస్, నిమ్మరాజుల సాగర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సలావుద్దీన్, సాహెబ్ హుస్సేన్, ఇరికిల్ల సంపత్, మంథని మాజీ ఉపసర్పంచ్ పుప్పాల బాగ్యలక్ష్మితిరుపతి, బీఆర్‌ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బుద్దార్థి రాణి తదితరులు పాల్గొన్నారు.
– మంథని/రామగుండం/సుల్తానాబాద్/కమాన్‌పూర్/ఎలిగేడు/ఓదెల/యైటింక్లయిన్‌కాలనీ/జూలపల్లి

ఊరూరా మొహర్రం

ఊరూరా మొహర్రం

ఊరూరా మొహర్రం