రామగుండం అభివృద్ధికి సహకారం
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తానని రాష్ట్ర ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభయం ఇచ్చారు. రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆదివారం తన స్వస్థలం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తొలుత మంత్రి స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంత బిడ్డగా నగరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, విద్య, వైద్య రంగంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు మార్గనిర్దశంతో ప్రజాసేవ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


