విద్యార్థుల వికాసానికి దోహదం
● డీఈవో మాధవి
ధర్మారం(ధర్మపురి): విద్యార్థుల సంపూర్ణ వికాసానికి, సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పత్తిపాక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను గురువారం ఆమె సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలపై సమీక్షించారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారు. బడిబాట సందర్భంగా నూతనంగా చేరిన విద్యార్థుల వివరాల గురించి హెచ్‌ంఎలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని ఆమె తెలిపారు. పదో తరగతి ఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ధర్మారం మండలం అగ్రభాగాన నిలవడవం ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. తొలిరోజే 14 మంది విద్యార్థులు ప్రవేశం పొందడం అభినందనీయమన్నారు. మండల విద్యాధికారి ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు నరేందర్‌రావు, మల్లన్న, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ ప్రేంసాగర్ తదితరులు పాల్గొన్నారు.
16లోగా పుస్తకాలు పంపిణీ చేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 16వ తేదీలోగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించాలని డీఈవో మాధవి సూచించారు. ఇప్పటికే 1,72,348 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరవేశారని, అందులో 50,668 పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.


