పెద్దపల్లిరూరల్: స్వశక్తి సంఘాల మహిళలు వ్యాపార రంగంలో రాణించేలా అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా వీ హబ్ సహకారంతో జిల్లాలో మహిళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. వ్యాపారాభివృద్ధిపై కలెక్టరేట్‌లో మంగళవారం స్వశక్తి మహిళలకు ఆయన అవగాహన కల్పించారు. ఆహార, ఉత్పత్తి, హస్తకళలు, టెక్స్‌టైల్ లాంటి రంగాల్లో శిక్షణ ఇస్తామని, యువత తమ ఆలోచనలను ఉన్నతంగా ఎంచుకుంటే వీ హబ్ ద్వారా సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీ హబ్ డైరెక్టర్లు జహీద్ అక్తర్ షేక్, ఊహ, డీఆర్డీవో కాళిందిని, ప్రతినిధులు సాయిరాం, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, ప్రిన్సిపాల్ మురళి, ఉష తదితరులు ఉన్నారు. కాగా, కుంగ్‌ఫూ కరాటే జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ శ్రీహర్ష ఈ సందర్భంగా అభినందించారు.
తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలి
ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమాయోజన పథకం కింద ఇండియా పోస్ట్ పేమెంట్ బాంకు ద్వారా రూ.436 ప్రీమియం చెల్లించి రూ.2లక్షల బీమా పొందవచ్చని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పథకం ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును కలెక్టర్ బాధితులకు అందజేశారు. రెండేళ్లలో 20మంది బీమా క్లెయిమ్ చేశారని ఆయన తెలిపారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, ఇండియా పోస్ట్‌పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టె శ్రీనివాస్, మేనేజర్ మోహన్‌సాయి తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి