గోదావరిఖని: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆర్జీ–1 సేవా అధ్యక్షురాలు అనిత తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సేవా సమితి ట్రెయినర్లతో ఆమె సో మవారం సమావేశమయ్యారు. ఈనెల 6న స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్‌లోని గోదావరికళా ప్రాంగణంలో మహిళలకు ఆటలు, ఇతర పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్‌సీవోఏ క్లబ్‌లో అత్యత్తుమ సేవలు అందించిన మహిళలను సన్మానిస్తామని అన్నారు. పర్సనల్ డీజీఎం కిరణ్‌బాబు, సీనియర్ పీవో హన్మంతరావు, సేవా జాయింట్ సెక్రటరీ బీనాసింగ్, కో ఆర్డినేటర్లు తిరుపతి, రవికుమార్‌పాల్గొన్నారు.