జిల్లాలో మరో మండలం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మరో మండలం ఏర్పాటు

Dec 24 2024 12:08 AM | Updated on Dec 24 2024 12:08 AM

జిల్లాలో మరో మండలం ఏర్పాటు

జిల్లాలో మరో మండలం ఏర్పాటు

● గుంజపడుగు మండలం ఏర్పాటుకు అడుగులు

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో మరో కొత్త మండలంతోపాటు ఏడు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయి. అనేక ఏళ్ల డిమాండ్‌గా ఉన్న గుంజపడుగు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు అడుగులు పడుతుండడంపై హర్షం వ్యక్తమవుతోంది.

2016లో పెద్దపల్లి జిల్లాగా..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక ఉమ్మడి కరీంనగ ర్‌ జిల్లానుంచి విడిపోయి 2016లో పెద్దపల్లి జిల్లా గా ఏర్పాటైంది. కొత్త జిల్లాతోపాటు రామగిరి, అంతర్గాం మండలాలను ఏర్పాటు చేస్తూ మొత్తం 14 మండలాలు, 266 గ్రామ పంచాయతీలతో పెద్దపల్లి జిల్లా ఆవిర్భవించింది. కొత్త మండలాల పునర్విభజన నాటి నుంచి గుంజపడుగు, గర్రెపల్లి మండలా ల ఏర్పాటు డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. తాజా గా గుంజపడుగు మండలంతోపాటు ఏడు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం సిద్ధం చేయడం చర్చకు దారితీసింది.

Advertisement
 
Advertisement
Advertisement